తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

సమాజాన్ని గంజాయి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కాపాడుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కె.రమాదేవి పిలుపు ఇచ్చారు.డి వై ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక ఫోరం చేపట్టిన జన చైతన్య యాత్ర లో ఆమె సింగరాయకొండ బొమ్మల కూడలి కందుకూరు రోడ్డు వద్ద ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమాదేవి అవగాహన కల్పిస్తూ విద్యార్థులు యువకులు డ్రగ్స్ మహమ్మారి ఊబిలో పడి జీవితాలని నాశనం చేసుకోవద్దని హితవు చెప్పారు. మత్తు పదార్థాల కి వ్యతిరేకంగా ఉద్యమించాలి డివైఎఫ్ఐ యాంటీ డ్రగ్స్ జన చైతన్య జీపు యాత్ర విద్యార్థులు యువకులు మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలని విద్యార్థులు యువకులు మీ జీవితలని నాశనం చేసుకోవద్దు అని కోరారు. గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడం లో ప్రతి ఒక్కరు పాటుపడాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కె రమాదేవి అన్నారు. ప్రస్తుతం మన సమాజాన్ని వేధిస్తున్న అత్యంత ప్రమాదకర సమస్యల్లో గంజాయి మరియు మాదక ద్రవ్యాల వ్యసనం ప్రధానంగా మారిందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు యువకులును లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ మాఫియా తమ వల విస్తరిస్తుందని మహిళలలు కూడా తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు వాడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని వాటిని అరికట్టేందుకు కలిసి రావాలని తమ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని వారు అన్నారు.నేటి సమాజంలో డ్రగ్స్ గంజాయిని నిర్మాలించాల్సిన ప్రజాప్రతినిధులే డ్రగ్స్ ని వాడుతు పోలీసులకి దొరుకుతున్నారని.ఏడు సంవత్సరాల బాలికలపై అత్యాచార జరుగుతున్నాయని. రాష్ట్రంలో గంజాయిని పట్టుకుంటున్నారని దీన్ని పూర్తిగా నిర్మూలించాలని వారు అన్నారు. అనంతరం మత్తు పదార్థాలు వాడకూడదని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో డివై ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు కె వి పిచ్చయ్య.యాంటీ డ్రగ్స్ ఫోరం బాలల సంఘం నాయకులు సిహెచ్ వినోద్.ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరస్వామి.నాయకులు ఆకాష్. ప్రశాంత్. విజయ్. పిఎన్ఎమ్ జిల్లా నాయకురాలు సుజాత. డివైఎఫ్ఐ నాయకులు నవీన్. తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *