తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ఏటీఎం కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలను పోలీస్ బృందాలు సందర్శించి, అక్కడి భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా సీసీ కెమెరాల పనితీరు, అలారం వ్యవస్థలు, రాత్రివేళల్లో వెలుతురు, సెక్యూరిటీ గార్డుల విధులు వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఏటీఎంల వద్ద స్కిమ్మింగ్ పరికరాల ద్వారా మోసాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు. నగదు ఉపసంహరణ సమయంలో అపరిచితుల సహాయం తీసుకోవద్దని, తమ పిన్ నంబర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని ప్రజలకు సూచించారు.ప్రజల ఆస్తిపాస్తులను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యతగా భావిస్తూ, ఏటీఎంల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.