తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నగుడిపాడు గ్రామంలో అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 6 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి రూ.40,350 నగదు, 6 ద్విచక్ర వాహనాలు మరియు 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జూదానికి ఉపయోగించిన సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేశారు.అక్రమ జూదం వంటి చర్యలు సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని పోలీసులు తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు తమ పరిసరాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి, శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని దొనకొండ పోలీసులు విజ్ఞప్తి చేశారు.