తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్(FAC) గా కుమారి దాసరి శిరీష గురువారం బాధ్యతలు స్వీకరించారు. కళాశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు. కళాశాలలో పనిచేయుచున్న గత ప్రిన్సిపల్ ఇంటర్మీడియట్ బోర్డునకు వెళ్లడం వలన ఖాళీ ఏర్పడగా ఆస్థానములో కళాశాల సీనియర్ ఆధ్యాపకురాలు కుమారి దాసరి శిరీష గారిని గుంటూరు ఆర్జేడి గారి ఆదేశాల మేరకు ఇంగ్లీష్ అధ్యాపకురాలు అయిన శిరీష గారు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శిరీష గారు మాట్లాడుతూ కళాశాలను అభివృద్ధి పదంలో నడిపించడంలో మీ అందరి సహాయ సహకారాలతోటి మన జిల్లాలో ఉన్నత స్థానంలో నిలపటానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ సంవత్సరము అడ్మిషన్లు గత సంవత్సరము కంటే ఎక్కువ చేయటానికి నా వంతు కృషి చేస్తాను అని అన్నారు. ఈ కాలేజీ నా సొంత ఊరిలో సొంత కాలేజీకి ప్రిన్సిపాల్ గా అవకాశం కల్పించటం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఓ వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు, బి.వి కాశీరత్నం, రాజశేఖర్, కట్టా సుబ్బారావు, హజరత్, మాధవి లక్ష్మి, మాధవరావు ,రాజు అధ్యాపక అధ్యాపకేత్ర సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *