తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

‘స్కై ఐ – ప్రకాశం’ ప్రాజెక్ట్‌లో భాగంగా, పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పగుంట గ్రామ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ బీట్ నిర్వహించారు.పొన్నలూరు ఎస్సై ఆధ్వర్యంలో చేపట్టిన ఈ డ్రోన్ నిఘా ద్వారా గ్రామ పరిసరాల్లో అనుమానాస్పద మరియు అక్రమ కార్యకలాపాలను గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించారు. దూర ప్రాంతాలు, పొలాలు మరియు చెట్లతో కూడిన ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించారు.నేరాలను ముందుగానే గుర్తించడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టడం మరియు ప్రజలకు భద్రత కల్పించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ఆధునిక సాంకేతికతతో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తూ ఇలాంటి డ్రోన్ సర్వైలెన్స్ కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు.ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి, శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పొన్నలూరు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *