తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో గల 27వ నెంబర్ పొగాకు వేలంకేంద్రంలో… పొగాకు అమ్మకాలను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, బోర్డు రీజినల్ మేనేజర్ దివి వేణుగోపాల్, ఇతర అధికారులతో కలిసి గురువారం ప్రారంభించారు. తొలిరోజు వలేటివారిపాలెం మండలం అమ్మపాలెం గ్రామం నుంచి 18 బేళ్ళు వేలానికి రాగా, ప్రారంభ ధర కిలో 250 రూపాయలు పలికింది.
ఎమ్మెల్యే నాగేశ్వరరావు కందుకూరు ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు పొగాకు పంటపై ఆధారపడి ఉన్నారని, ఏడాదికేడాది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. పొగాకు వ్యాపారులు రైతుల బాధలను గమనించి, వారిపట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తూ కొనుగోళ్లు జరపాలని ఎమ్మెల్యే సూచించారు. గత ఏడాది గిట్టుబాటు ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఈ ఏడాది మార్కెట్ పై రైతులు ఆందోళనగా ఉన్నారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పారు. ఈ సంవత్సరం పంట నాణ్యత కూడా బాగుందని, గడిచిన ఏడాదికంటే రేట్లు పెంచాలన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *