వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం నూతన జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన షేక్ సైదా
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విజయ సునీత ,ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మార్కాపూర్ లోని కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి మెమొంటోని అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో , షేక్ సైదా ఇతర కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మార్కాపూర్ నూతన జిల్లా ఏర్పాటు కోసం 65 రోజులపాటు జరిగిన ఉద్యమ ప్రశ్నిస్తే అన్ని వివరించడం జరిగింది. అలాగే గతంలో ఈ ప్రాంతంలో పేదల భూముల్ని పెద్దలకు ఆన్లైన్ చేసిన ఇద్దరు ఎమ్మార్వోలు దాదాపు 12 మంది వీఆర్వోలు సస్పెండ్ అయిన విషయాన్ని కలెక్టర్ ,కి వివరించడం జరిగింది భూ కబ్జాలు జరగకుండా రెవిన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, అసంపూర్తిగా ఉన్న షాది ఖాన్ నిర్మాణాన్ని కృషి చేయాలని, వేసవి అయినందున త్రాగునీటి వద్దకు తీవ్రంగా ఉందని, ఈ ప్రాంత సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి త్వరితిగతంగా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని కలెక్టర్ ,ని
షేక్ సైదా . కోరారు. అలాగే ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ ను పట్టానికి నడిబొడ్డునున్న ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించాలని ఇప్పుడున్న కలెక్టరేట్ ప్రాంతం పట్నానికి దూరంగా ఉందని అనేకమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు అక్కడి నుంచి ఆటోలో రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి మంచినీళ్లు కూడా దొరికినప్పుడు పరిస్థితులు ఉన్నందువల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
అన్ని సమస్యలను సావధానంగా విన్న జిల్లా కలెక్టర్ అన్ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు షేక్ మహబూబ్వాలి, మార్కాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సయ్యద్ ఇమ్రాన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ నాయకులు, వీరేపల్లి గోపాల్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ రెహనాబాను, తర్లపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవయ్య, మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ కన్వీనర్ షేక్ ఖాసిం, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు షేక్ అల్తాఫ్, కేకేసి నాయకులు షేక్ ఇమ్రాన్, షేక్ నాగురు భాష తదితరులు పాల్గొన్నారు.