తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

మూడు తరాలుగా స్వర్గీయ డాక్టర్ కోటారెడ్డి గారి కుటుంబం కందుకూరు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయం. ఈ సేవలను మరింత విస్తరించి, ఆధునిక సదుపాయాలతో ప్రజలకు మరింత ఉపయోగపడేలా కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను.ప్రజల ఆరోగ్యం మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికే 1200 మందికి సహాయం అందించగలిగాము. దాదాపు ₹10 కోట్లు మంజూరు చేసి ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చింది. త్వరలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించే ఇన్సూరెన్స్ పథకాలను అందుబాటులోకి తీసుకురానున్నాం.ఈ సందర్భంగా హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కార్పొరేట్ స్థాయి ల్యాబ్‌ను ప్రారంభించడం జరిగింది. ఇక్కడి వైద్యసిబ్బంది ఆధునిక సాంకేతికతతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరుకుంటున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *