తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల ప్రవేశాల కోసం సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని పెద్ద గొల్లపాలెంలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి, పాత సింగరాయకొండ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, షూస్, సాక్షు లు పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, స్కూల్ బ్యాగ్, పౌష్టికాహారం వంటి సౌకర్యాలు ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు.
“ప్రభుత్వ బడి – అమ్మబడి”, “విద్య నేర్చుకో – వెలుగు చూసుకో”, “ప్రభుత్వ విద్య – ఉచిత విద్య” వంటి నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను పాత సింగరాయకొండ ఉన్నత పాఠశాలలో చేర్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసులు, జెడ్పిహెచ్ఎస్ పాత సింగరాయకొండ ఉపాధ్యాయులు ఎల్. శ్రీనివాసులు, ముజఫర్ భాష, పెద్దగొళ్లపాలెం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పరాణి, గౌతగట్లవారిపాలెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు, బింగినపల్లి ఎస్సీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య,బాలయోగి నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొల్లూరు వెంకయ్య నరసింహనగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి, సిఆర్పి వంశీ, ఉపాధ్యాయులు ప్రభాకర్, చెంచు రామారావు, పూర్వ విద్యార్థులు మాలిరావు, రాయి రవీంద్ర, నక్క సురేంద్ర తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
