తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల ప్రవేశాల కోసం సోమరాజుపల్లె మోడల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు.
మండల విద్యాశాఖాధికారి ఆవుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారం, బెల్ట్, షూస్, బ్యాగ్‌తో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. ప్రతి తరగతికి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు బోధన నిర్వహిస్తున్నారని, ఆధునిక సాంకేతికతతో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు.
ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని, గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు విద్యావంతులు పాఠశాలకు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో కృషి చేయాలని అన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో CRP కూతల వంశీ, ఉపాధ్యాయులు శీలం ప్రసాదరావు, లలిత కుమారి, రాదేశ్యామ్ మరియు పాఠశాల చైర్మన్ మసనం శ్రీలక్ష్మి పాల్గొన్నారు.