తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
గుడ్లూరు మండలం తెట్టు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేయడం చేశారు. ఈ తనిఖీలో పాఠశాల నిర్వహణలో జరుగుతున్న తీవ్రమైన నిర్లక్ష్యం నా దృష్టికి వచ్చింది..ముఖ్యంగా హాజరు రిజిస్టర్‌కు, తరగతి గదిలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు పొంతన లేకపోవడం దిగ్భ్రాంతి కలిగించింది. 25 మందికి హాజరు వేసి కేవలం 16 మంది మాత్రమే ఉండటం, మరోచోట 22 మందికి గాను 15 మంది మాత్రమే ఉండటం ఉపాధ్యాయుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇలా తప్పుడు హాజరు వేసి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించడం క్షమించరాని నేరం. దీనిపై తక్షణమే ఉన్నతాధికారులకు నివేదిక పంపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.అలాగే పాఠశాలలో మరుగుదొడ్ల పరిశుభ్రతను, విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించాను. శుక్రవారం మెనూ ప్రకారం అన్నం, గుడ్డు, కూర నాణ్యంగా ఉండాలని వంట సిబ్బందిని హెచ్చరించాను.
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్య, సదుపాయాలు అందడమే మా లక్ష్యం. విధుల్లో అలసత్వం వహించే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
