బ్లాక్ స్పాట్లు మరియు ఆక్సిడెంట్ జరగటానికి అవకాశము ఉన్న ప్రదేశాలలో 115 ప్రాంతాల్లో కన్‌వెక్స్ మిర్రర్లు (కుంభాకార దర్పణం), స్ప్రింగ్ పోల్స్ ఏర్పాటు
ప్రమాదం తర్వాత కాదు… ముందుగానే జాగ్రత్తలు, అవగాహనతో ప్రాణాలు కాపాడుకోండి: జిల్లా ఎస్పీ
ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు భద్రత నియమాలను పాటించాలి: జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ శాఖ సమగ్రంగా పనిచేస్తోందని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు, ఐఏఎస్ గారి సహకారంతో 125 కుంభాకార దర్పణాలను (Convex Mirrors) మరియు 150 స్ప్రింగ్ పోల్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా బ్లాక్ స్పాట్లు, గ్రామాల నుంచి మెయిన్ రోడ్లకు వెళ్లే ప్రదేశాలు, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలు కలిపి మొత్తం 115 ప్రదేశాలను గుర్తించినట్లు తెలిపారు. ఆ ప్రదేశాలలో నేషనల్ హైవే మరియు ఆర్ & బి అధికారులతో కలిసి కన్‌వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. వీటి ద్వారా మలుపుల్లో కనిపించని వాహనాలను ముందుగానే గుర్తించి వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయగలరని, తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. అదేవిధంగా, స్ప్రింగ్ పోల్స్‌ను రోడ్డు ఇంజనీరింగ్‌లో భాగంగా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం, నార్త్ బైపాస్, సౌత్ బైపాస్, మంగమూరు జంక్షన్‌లతో కలిపి నాలుగు ప్రధాన జంక్షన్లు వద్ద ఫ్రీ లెఫ్ట్ మార్గాల్లో వాహనదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త నేషనల్ హైవే రోడ్డు పై వాహనదారులు,ప్రజలు రోడ్లపైకి వచ్చేటప్పుడు అవగాహన లేక వేగంగా రావటం ప్రమాదాన్ని గురి కావడం జరుగుతుందన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పశ్చాత్తాపం చెందే కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక నిఘా ఉంచుతూ, ప్రయాణికుల భద్రత కోసం ప్రతిరోజూ రాత్రి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ పాయింట్లు, ఫైర్ సేఫ్టీ పరికరాలు సక్రమంగా ఉన్నాయా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, విధి గంటలు, ఆరోగ్య పరిస్థితులను కూడా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లపై డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేసి, రహదారి భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రెండు జిల్లాలలో 2500 ఎల్ఈడి బల్బులు గుర్తించి వాటిని ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి వాహనాలు నడపాలి. సెల్‌ఫోన్‌తో డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ చేయరాదు. వాహనాలను అతి వేగంగా నడపడం (ఓవర్ స్పీడ్), మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, రాంగ్ రూట్ రావటం, మాడిఫైడ్ సైలెన్సర్లు (పెద్ద శబ్దాలు చేసే సైలెన్సర్లు), ఎల్‌ఈడీ మరియు హై బీమ్ లైట్లు వాడకూడదు. వాహనదారులందరూ రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.రోడ్డు ప్రమాదాల నివారణలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు, ఐఏఎస్ గారి సహకారం అభినందనీయమని, కలెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు.ఈ సమావేశంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్, డిసిఆర్బీ దేవప్రభాకర్, ఎస్సై మాల్యాద్రి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
