తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ చెందోడు నగర్ లోని ఎంవి రావు ఫౌండేషన్ మీటింగ్ హాల్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరిగింది ముఖ్య అతిథులు ఎంవి రావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు లీలా కృష్ణ మోహన్, విజయలక్ష్మి దంపతులు, సాధనాల వెంకటస్వామి నాయుడు, పొట్రు రామకృష్ణ టీచర్, ఆర్కే ఫౌ, జ్యోతి రెడ్డి మన టీవీ ఛానల్ యజమాని, అమీనా బిజెపి స్వచ్ఛభారత్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, అన్నదాత తన్నీరు శివశంకర్, సింగర్ తెలంగాణ పల్లె ప్రవీణ్ కళాకారుడు చేతుల మీదుగా డా బి.ఆర్ అంబేద్కర్ జాతీయ ఉపాధ్యాయ పురస్కారాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు అందుకున్నారు. నేను సామాజికంగానూ ఆధ్యాత్మికంగానూ స్వచ్ఛందంగా పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ అవార్డు అందించినందుకు ఎంవి రావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు లీలా కృష్ణ మోహన్ కి కృతజ్ఞతలు తెలిపిన బి యస్ నారాయణరెడ్డి ఈ సంతోషాన్ని స్నేహితులు ఏ వో ఎల్ సభ్యులు గిద్దలూరు ప్రజలు బంధుగణం బద్వేల్ తాలూకా లోని స్నేహితులు అభినందనలు తెలిపారు.