తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

బి.ఆర్ ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల డైరెక్టర్ జి.బాల భాస్కరరావు గారి చిన్న కుమారుడు గగన్ రక్షిత్ పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం కందుకూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ లో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు, బాటసారులకు ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు స్వయంగా పాల్గొని, వడ్డన చేసి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. డైరెక్టర్ జి. బాల భాస్కరరావు మాట్లాడుతూ.. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు.ఈ సేవా కార్యక్రమంలో బి.ఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల డైరెక్టర్లు జి. బాల భాస్కరరావుతో పాటు బి.నరేంద్రబాబు,కొత్తపల్లి సురేష్, ఇంటూరి మహేంద్ర, తల్లపనేని రాజా, ఉప్పుటూరి సుబ్బయ్య, ఉన్నం రవి,నాయుడు మరియు విద్యాసంస్థల సిబ్బంది, పలువురు ముఖ్యులు పాల్గొని అన్న సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *