తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మహిళలు మరియు చిన్నారుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి చేరుకునేలా పాఠశాలలు, గ్రామాలు, మరియు ప్రజా ప్రదేశాల్లో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ కార్యక్రమాలలో భాగంగా, పిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి సులభంగా అర్థమయ్యే విధంగా వివరించడంతో పాటు, ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచిస్తున్నారు. చిన్నారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, తమ భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు.
అదేవిధంగా మహిళలకు శక్తి యాప్ వినియోగంపై సమగ్రంగా వివరిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ఒక క్లిక్‌తో పోలీస్ సహాయం పొందే విధానాన్ని చూపిస్తున్నారు. ఈ యాప్ మహిళల భద్రతకు శక్తివంతమైన సాధనంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.సమాజంలో మహిళలు, పిల్లల రక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అప్రమత్తతతో ఉండాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా నేరాలను ముందుగానే అరికట్టడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.