తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

మార్కాపురం జిల్లా లో మార్కాపురం పట్నంలో శనివారం మార్కాపురం జిల్లా చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్, లక్ష్మీ నారాయణ, కర్ర.నాగిరెడ్డి గారి అధ్యక్షతన యం.ఆర్. మానవ హక్కుల సంఘం & అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి గారు జిల్లా సభ్యులతో కలిసి మార్కాపురం జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రావు, పల్నాడు జిల్లా చైర్మన్ గణేష్ , మార్కాపురం టౌన్ మహిళ విభాగం కు చెందిన అపర్ణ , పల్నాడు మహిళా విభాగం సెక్రటరీ త్రివేణి గారు, మార్కాపురం జిల్లా నియోజకవర్గ ఇంచార్జి లు, సెక్రటరీ లు, మండల ప్రెసిడెంట్ లు,జిల్లా సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మార్కాపురంలో బస్ ప్రమాద సమయంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి,ప్రమాద ఘటనలో సహాయ సహకారాలు అందించిన మానవ స్వచ్ఛంద సేవ సంస్థ కమిటీ వారిని గౌరవంగా ఆహ్వానించి ప్రశంసా పత్రాన్ని అందజేసి శాలువాతో సత్కరించడం జరిగింది.అదేవిధంగా మార్కాపురంలో ప్రభుత్వ హాస్పటల్ డాక్టర్ ని, మాజీ ఆర్మీ అధికారిని వెంకటేష్ కి,,ఫైర్ అధికారిని కూడా ప్రశంసా పత్రాన్ని అందజేసి శాలువాతో సత్కరించడం జరిగింది…
ఈ సందర్భంగా పలు మానవతా సంస్థ గుంటక.వనజాక్షి , మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు (మానవతా సంస్థ సభ్యులు) వెంకట కృష్ణ రావు ,శివ అయిన మాట్లాడుతూ మేము చేసిన సేవ కార్యక్రమాలు గుర్తించి మాకు గౌరవ సత్కరించిన యం.ఆర్.మానవ హక్కుల సంఘం అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి కి,జిల్లా చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు..అధికారులు మాట్లాడుతూ మా బాధ్యతగా ప్రభుత్వ అధికారులుగా బస్ ప్రమాద సమయంలో సేవా చేయడం జరిగింది..మాకు గుర్తించిన మానవ హక్కుల సంఘం వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఫైర్ స్టేషన్ అధికారి రామకృష్ణ తెలియజేశారు…మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఏమైన అవగాహన కార్యక్రమం లు ఏర్పాటు చేసిన మా వంతుగా పాల్గొని సహాయ సహకారాలు అందిస్తామని GGH హాస్పటల్ డాక్టర్ యం.ఆ రాంబాబు హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో యం.ఆర్.మానవ హక్కుల సంఘం & అవినీతి వ్యతిరేక అసోసియేషన్ లీగల్ అడ్వైసర్ లు , సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *