తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని డిహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు కోరారు. మార్కాపురంలోని పూల సుబ్బయ్య భవన్ నందు దళిత హక్కుల పోరాట సమితి కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలాగా పాలకులు పనిచేస్తున్నారని రాష్ట్రంలో దళితుల పరిస్థితి దయనీయంగా తయారైందని వారి అభివృద్ధికి కావలసిన ప్రణాళికలు రచించడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల ఓట్లతో అధికారం చేజిక్కించుకున్న పాలకులు వారి అభివృద్ధి వచ్చేసరికి విస్మరిస్తున్నారని అన్నారు దేశంలో అభివృద్ధి కుంటుపడిందని కేవలం మతం మత్తులో ప్రజలను దోబూస్లాడుతున్నారని అన్నారు బిజెపి దాని మిత్రపక్షాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే మతాన్ని వాడుకుంటున్నారని అన్నారు, దళితులు వారి స్థితిగతులు మారాలంటే పోరాటమే శరణ్యం రాజకీయ పార్టీలను నమ్ముకుంటే వారి భూదేవి అంధకారం కనుక మే నెల మూడో తేదీ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలు విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయం నందు మే నెల 3వ తేదీ జరుగు మహాసభలకు దళితులు అధిక సంఖ్యలో పాల్గొని పై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూర్ణ కంటి తిరుమలయ్య, పందిటి మోహన్, జిపి రామారావు, నాగయ్య,యు జోసెఫ్, శ్రీను, నాయక్, రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *