తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో జరిగిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్లలో టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ, బొట్లపాలెం ప్రజలు ఇచ్చిన మద్దతు మరువలేనిదని, బీసీలకు ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని అన్నారు.రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు