తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కెవికే కందుకూరులో ఐసీఏఆర్ నిర్కా డైరెక్టర్ డా.శేషు మాధవ్ మరియు ఆధ్వర్యంలో శాస్ట్రీయ సలహా సంఘ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా. శేషు మాధవ్ మాట్లాడుతూ కెవికే క్షేత్రస్థాయిలో వివిధ మిరప, పోగాకు, ఆముదం పంటలలో సమస్యలను గుర్తించి వాటికనుగుణంగా క్షేత్రప్రదర్శనలను, శిక్షణా కార్యక్రమాలను చేపట్టి పరిష్కారాలను అందివ్వాలని తెలిపారు. అలాగే రైతులను రైతు సంఘాలుగా ఏర్పాటు చేసి సెకండరి అగ్రికల్చర్ ను ప్రమోట్ చెయ్యాలని తెలిపారు. అలాగే ఉలవపాడు మామిడికి బౌగోలిక గుర్తింపు కొరకు ప్రణాళికలు సిద్ధం చేసి సమర్పించాలని తెలిపారు. అలాగే మిరపలో LCA-643 రకం మంచి ఫలితాలనిచ్చిందని కనుక ఈ రకాన్ని చాలా మంది రైతులకు చేరావేయాలని తెలిపారు. డా.జి. ప్రసాద్ బాబు మరియు శాస్త్రవేత్తలు డా.జ్యోతి, డా.వెంకటేష్, మయాంక్, డా. నిహారిక, డా.శ్రీరంగ మరియు వివేక్ వారు గత సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల ఫలితాలు మరియు వచ్చే సంవత్సరం చేపట్టబోయే కార్యక్రమాలను గురించి విపులంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు లాం సహాయ పరిశోధన సంచాలకులు డా. దుర్గాప్రసాద్, నిర్కా ప్రాంతీయ పరిశోధన స్థానం హెడ్ డా. అనురాధ, నూనెగింజల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. సతీష్ కుమార్, ఉధ్యాన కళాశాల ప్రిన్సిపాల్ డా. విజయ భాస్కర్, పోగాకు బోర్డు రీజనల్ మేనేజర్ ప్రసాద్, విస్తరణ మేనేజర్ రామకృష్ణ, ఆత్మా దీపిడి మాలకొండయ్య, సిడిపివో ఉషారాని, పశు సంవర్ధక శాఖ డిడి డా. శ్రీధర్ రావు, ఎడి డా. చంద్ర మోహన్, వ్యవసాయశాఖ మండల వ్యవసాయ అధికారులు రహీమ్, రవికుమార్, రాము కుమార్, రైతు ప్రతినిధులు, రైతు సంఘ సభ్యులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మాధవ, ఔత్సాహికులు, కెవికే అనుసంధాన రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని రాబోవు సంవత్సరంలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికపై వారి సలహాలను సూచనలను తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన మట్టి పరీక్షల కేంద్రాన్ని, విలువ ఆధారిత ఉత్పత్తులలో ఔత్సహికుల తయారీ కేంద్రాన్ని అతిధులు ప్రారంభించడం జరిగింది. కెవికే ని వన్ స్థాప్ షాప్ గా రాబోవు కాలంలో మార్చి రైతు సేవలో నిమగ్నమవ్వాలని తెలిపారు.