విజయవాడలో హోం మంత్రి వంగలపూడి అనిత గారిని దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాలు, ఒక పట్టణం కలిపి సుమారు రెండు లక్షల జనాభా ఉండటంతో పోలీస్ పరిపాలన సౌలభ్యం కోసం మరో సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం ఒకే సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పరిధిలో ఆరు పోలీస్ స్టేషన్లు ఉండటంతో పని ఒత్తిడి అధికంగా ఉందని వివరించారు.దీనిపై హోం మంత్రి వంగలపూడి అనిత సానుకూలంగా స్పందించి, శాఖాపరమైన నివేదిక తీసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అదేవిధంగా దర్శి డీఎస్పీ కార్యాలయానికి పక్కా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా, సంబంధిత అధికారులతో అంచనాలు రూపొందించాలని హోం మంత్రి ఆదేశించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *