దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి గాంచిన పాత సింగరాయకొండ గ్రామంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి కందుకూరుకు చెందిన అనుమల శెట్టి శ్రీకాంత్, సుధారాణి దంపతులు రెండు లక్షల రూపాయలు విలువైన వెండి తిరుకావేరి (కమండలం చెంబు)ను ఆదివారం విరాళంగా అందజేశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనువాసులు నాయుడు, ఈఓ పి. కృష్ణవేణి సమక్షంలో దాతలు స్వామివారికి వెండి తిరుకావేరిని సమర్పించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేక పూజలుతో దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు దాతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ఉదయగిరి వెంకటశేషా లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకులు ఉదయగిరి లక్ష్మీనరసింహాచార్యులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *