అఖిల భారత రైతు -కూలీ సంఘం,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్
తొలి శుభోదయం న్యూస్ కొండేపి :-
రైతుల పండించిన పొగాకు పంటకు క్వింటాకు 36 వేల రూపాయలకు కొనుగోలు చేయాలని,పొగాకు ధరలు పడిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి రైతుల దగ్గర పొగాకు గుట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ వై వి కృష్ణారావు.వై, చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కొండేపి మండల కార్యదర్శి కామ్రేడ్ ముప్పరాజు బ్రహ్మయ్య డిమాండ్ చేశారు
సోమవారం కొండేపి పొగాకు వేలం కేంద్రం ఒక్కటి సందర్శించిన అఖిలభారత రైతు-కూలీ సంaikms),ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు వేలం కేంద్రం సూపరిండెంట్ అమర్ నాధ్ కు మెమోరాండం సమర్పించారు, ఈ సందర్భంగా కామ్రేడ్ వై యు కృష్ణారావు.కామ్రేడ్ యం,బ్రహ్మయ్య మాట్లాడుతూ ఏప్రిల్ 9వ తేదీన పొగాకు వేలం వేలంపాటలు ప్రారంభమయ్యాయని,ప్రారంభం నుంచి కూడా రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతోరైతులు బ్యారెన్ కు మూడు నుండి నాలుగు లక్షల రూపాయల నష్టపోతున్నారని, పచ్చా కు కూలీలకు కూడా డబ్బులు చెల్లించలేని దీనావస్థకు చేరారు ,రైతులను ఆదుకోవలసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు, రైతులు వేలం కేంద్రానికి 200 బెళ్లు తీసుకొస్తే 100 బెళ్ళు తిరస్కరణకు గురవుతున్నాయని అందువలన రైతులు బేళ్లు తీసుకురావడానికి తీసుకుపోవటానికి ప్రయాణ ఖర్చులు లోడింగ్,అన్ లోడింగ్ ఖర్చులు భారంగా మారుతున్నాయని అందువలన బే ళ్లు తిరస్కరించకుండా కొనసాగించాలని, పొగాకు పంటకు క్వింటాలుకు 36,000 రూపాయలు ము
కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు, లేనియెడల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు,అలాగే ఏప్రిల్ 18వ తేదీ ఒంగోలు పట్టణంలో పొగాకు రైతుల సమస్యలపై సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు రైతులందరూ హాజరై జయప్రదం చేయాలని, పొగాకు గిట్టుబాటు ధర కోసం రైతులందరూ సంఘటితంగా పోరాడితేనే గిట్టుబాటు ధర లు వస్తాయని పిలుపునిచ్చారు, హాయ్ ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సిఎస్ సాగర్.ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఆర్,మోహన్. ప్రగతిశీల మహిళా సంఘం (pow) జిల్లా అధ్యక్షురాలు కామ్రేడ్స్ యస్,భారతి తదితరులు పాల్గొన్నారు