తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ఉమ్మడి ప్రకాశం,నెల్లూరు జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయం ప్రధాన ధ్యేయంగా జన సైనికులు పాటు పడాలి
మాజీమంత్రి ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల డిలీమిటేషన్ కమిటీ రాయలసీమ,ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల డిలిమిటేషన్ కమిటీ సభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసైనికులకు స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలు సౌత్ బై పాస్ రోడ్డు సమీపం లోని బాలాజీ తిరుపతి రావు కళ్యాణ మండపం లో జనసేన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాలలో పని చేస్తున్నానని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి. ఏడు సార్లు పోటీ చేస్తే ఐదు సార్లు గెలవడం జరిగిందని మంత్రిగా పనిచేశానని రెండుసార్లు సామాజిక సమీకరణాల ప్రభావంతో ఓటమి చవిచూడటం జరిగిందని జన సైనికులకు తన రాజకీయ ప్రస్థానం గురించి చెప్పారు. జన సైనికుడు, జనసేన రాష్ట్ర అధ్యక్షుడు కొణిదల పవన్ కల్యాణ్ తనను గుర్తించి జనసేన లో క్రియాశీల నాయకుడిగా సేవలు అందించే అవకాశం కల్పించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం లో వికసిత భారత్, వికసిత ఆంధ్ర ప్రదేశ్, బంగారు ఆంధ్ర గా తీర్చిదిద్దేందుకు కనసేన ఎన్ డి ఎ కూటమి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం పార్టీ పటిష్ఠం కోసం జిల్లా లో ప్రతి జన సైనికుడు అవిశ్రాంతంగా పని చెయ్యాలని బాలినేని పిలుపు ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లో కూటమి పార్టీలు తీసుకున్న నిర్ణయాలను, ఆదేశాలను కార్యాచరణ ను చిత్త శుద్ధితో అమలు చేయడం ప్రతి కార్యకర్త నాయకుడి బాధ్యత అని గుర్తు చేశారు. రిజర్వేషన్ లు ఖరారు తర్వాత కూటమి నిర్ణయం మేరకు పని చేయాలని ఎక్కడయినా కూటమి మిత్ర పక్షాల వైపు నుండి వ్యతిరేకత, ప్రతిఘటన ఎదురైతే దాన్ని కూటమి అధినాయకత్వం దృష్టిలో పెట్టి పరిష్కరించుకునేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని జన సైనికుల కి బాలినేని హామి ఇచ్చారు. ఏది ఏమైనా జన సైనికులు కూటమి పార్టీ ల నిర్ణయాలను అమలు చెయ్యాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఏపి టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్, ఉడా చైర్మన్ షేక్ రియాజ్ ,వివిధ జిల్లాల స్థానిక నాయకులు పాల్గొన్నారు.