తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
తెలుగుదేశంపార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమం ఈసారి నెల్లూరు జిల్లాలో జరగనున్న నేపథ్యంలో, జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను.సోమవారం మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి కోవూరు నియోజకవర్గ పరిధిలోని కిసాన్ సెజ్ (Kisan SEZ) ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న సభా స్థలిని క్షేత్రస్థాయిలో పరిశీలించాను.జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కమిటీల సభ్యులందరి సమన్వయం మరియు సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను.ఈ పరిశీలన కార్యక్రమంలో సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు గారు, టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు బీద రవిచంద్ర , సహచర ఎమ్మెల్యేలు తదితరులతో కలిసి పాల్గొన్నాను.