ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 32 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా మార్కాపురంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., గారు సోమవారం మార్కాపురం, జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ గారు స్వీకరించి వారితో మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి పిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వర పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు. అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంభందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి,నిర్ణీత గడువులో పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకొని, సంఘటన స్థలాలను సందర్శించి చట్టప్రకారం సత్వర న్యాయం అందించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గారు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ , పొదిలి సీఐ రాజేష్ కుమార్, కంభం సీఐ మల్లికార్జున రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
