తాగునీటికి సంబంధించిన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు. నిబంధనల మేరకు పనిచేయకపోతే కాంట్రాక్టర్లతోపాటు అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.కొండపి నియోజకవర్గం లో జరుగుతున్న తాగునీటి నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ పర్యవేక్షణలో జరుగుతున్న పనుల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. కాగా, ఆశించిన స్థాయిలో పురోగతి కచ్చితంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ పనులను తక్షణమే ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు.బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం ఉండదని కూడా కలెక్టర్ తెలిపారు. కాంట్రాక్టర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.ఈ సమావేశంలో డీపీవో వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ మహేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *