ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ గారు దొనకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ రికార్డులు, కేసు ఫైళ్లు మరియు వివిధ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులు, ఫైళ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. దర్యాప్తు నాణ్యతను మెరుగుపరుస్తూ, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అదేవిధంగా మహిళల భద్రత, మహిళలపై నేరాల నివారణ, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలు మరియు శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ సేవలు అందిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలీసింగ్ నిర్వహించాలని డీఎస్పీ గారు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *