తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
మార్కాపురం జిల్లా హెచ్.ఎం.పాడు గ్రామ సమీపంలోని కనిగిరి–వేములపాడు రహదారిపై హఠాత్తుగా వీచిన బలమైన గాలుల కారణంగా ఒక పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న వెంటనే హెచ్.ఎం.పాడు పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీ రాజ్‌కుమార్ గారు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం గ్రామస్థుల సహకారంతో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి, ట్రాఫిక్‌కు ఏర్పడిన అంతరాయాన్ని నివారించారు. చెట్టు తొలగింపు పనులను వేగంగా పూర్తి చేసి, వాహనాల రాకపోకలు సాఫీగా కొనసాగేలా చర్యలు చేపట్టారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి ప్రజల భద్రత, రహదారి సౌకర్యాల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించిన హెచ్.ఎం.పాడు పోలీసులు, ఎస్సై రాజ్‌కుమార్ గారి సేవలను స్థానిక ప్రజలు అభినందించారు.