విజయవాడలో గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెంనాయుడు గారిని ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశాను. కందుకూరు ప్రాంత పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాను. ఈ ఏడాది పొగాకుకు గిట్టుబాటు ధర లభించక, వ్యాపారుల మందకొడి కొనుగోళ్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పెట్టుబడులు కూడా తిరిగి వస్తాయో లేదో అన్న ఆందోళనలో ఉన్న మా ప్రాంత రైతుల ఆవేదనను వివరించి, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశాను. మా విన్నపంపై మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఈ వారంలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారులతో ప్రత్యేక భేటీ నిర్వహించి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రైతుల సమస్యల పేరుతో వైసీపీ నేతలు అనవసరంగా రభస చేస్తున్నారు. మేము చిత్తశుద్ధితో రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాం. రైతు శ్రేయస్సే మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *