తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముండ్లమూరులో గౌరవ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారితో కలిసి దర్శి తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు ఏపీ మోడల్ స్కూల్‌లో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ గారు మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరితమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి “అమ్మ పేరుతో ఒక మొక్క” స్ఫూర్తితో ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటాలని కోరారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత, వాయు కాలుష్య నివారణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో ముందుండి ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు.