ప్రపంచ సైకిల్ దినోత్సవం–2026ను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.,గారి ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం “Sunday’s on Cycle” కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎఆర్ డిఎస్పీ కె. శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్ని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ఆర్టీసీ బస్టాండ్ మరల గ్రౌండ్ వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, శారీరక దృఢత్వం, పర్యావరణ సుస్థిరత మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో సైకిల్ ర్యాలీని నిర్వహించామని,ఆధునిక జీవనశైలిలో వాహనాలపై అధికంగా ఆధారపడటం వల్ల వ్యాయామం తగ్గిపోతుందని, దాని ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. సైక్లింగ్ అనేది కేవలం వ్యాయామ సాధనం మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని కాపాడే, కాలుష్యాన్ని తగ్గించే మరియు ఇంధన పొదుపుకు దోహదపడే ఉత్తమ రవాణా మార్గం అన్నారు. రోజూ కొంత సమయం సైక్లింగ్ చేస్తే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు భవిష్యత్ తరాల కోసం శుభ్రమైన వాతావరణాన్ని కాపాడటానికి కూడా తోడ్పడుతుందని పేర్కొన్నారు.ప్రత్యేకించి పోలీసు సిబ్బంది విధుల ఒత్తిడి నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరమని, క్రమం తప్పకుండా సైకిల్ తొక్కడం వల్ల శక్తి, స్థైర్యం పెరిగి ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించగలమని అన్నారు.

అదేవిధంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో Sunday’s on Cycle” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమణారెడ్డి, ఆర్ ఎస్సైలు,పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *