తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

ప్రకాశం జిల్లా కలెక్టర్ కు జర్నలిస్టుల పిల్లల ప్రైవేట్ స్కూల్లలో ఫీజు రాయితీ కోరుతూ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం సభ్యులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ప్రకాశం జిల్లా అధ్యక్షులు గద్దల శివాజీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. చిన్న పత్రికలు, వెబ్ ఛానళ్లలో పనిచేసే జర్నలిస్టులు తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల చదువుల విషయంలో ఫీజులు కట్టడం వారికి భారంగా మారిందని తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, వివిధ వర్గాలకు కల్పిస్తున్నట్లే జర్నలిస్టుల పిల్లలకు కూడా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉన్నత విద్య అభ్యసించే వారికి ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలని, జర్నలిస్ట్ సంక్షేమ నిధి నుండి విద్యా సహాయం అందించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు .కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఫోరం కోశాధికారి షేక్ నాసిర్ మాట్లాడుతు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఫోరం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర నాయకులు బొడ్డు శ్రీనివాసరావు,సభ్యులు యర్రజర్ల రమేష్, పాలపర్తి సతీష్, జలీల్, కాలేషా, జయరాజ్, తదితర సభ్యులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *