తొలి శుభోదయం న్యూస్ దర్శి:-

ప్రజా దర్బార్ అనంతరం స్థానిక ఎండీఓ కార్యాలయం వద్ద రైతులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ, రైతుల అభివృద్ధి మరియు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ముందుచూపుతో చేపట్టిన ఈ కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు.ఎరువులు, విత్తనాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని డా. లక్ష్మి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, జనసేన మండల అధ్యక్షులు తోట రామారావు, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు మరియు రైతులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *