ఒంగోలు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ ప్రతినిధి బృందం సంస్థ చైర్మన్ మారెళ్ళ సుబ్బారావు ఆధ్వర్యంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ టి. వెంకట కృష్ణయ్య ని కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది, మానవత సంస్థ సేవా కార్యక్రమాలు కమిషనర్ గారికి వివరించడం జరిగింది ఫ్రీజర్ బాక్సులు , శాంతి రథం ఉంచుకొనుటకు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల మహాప్రస్థానం నందు అవకాశం ఇప్పించవలసినదిగా కోరారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు , ఈ సందర్భంగా మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల మహాప్రస్థానంలో గ్యాస్ క్రిమిటోరియం ను ప్రారంభించాలని నగరంలో మూడు స్మశాన లను ఆధునికరించాలని కోరారు,
ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు శరభలింగాచారి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జాయింట్ సెక్రెటరీ మోటుపల్లి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు వడ్డేంపూడి సుజాత రావ్, కోసూరిశ్రీదేవి, చెరుకూరిఆదిలక్ష్మి రమణి, రాజి, సరస్వతి, బాబు, నేరెళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *