google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

సింగరాయకొండ విద్యారంగంలో సేవలందించిన ప్రముఖ తెలుగు ఉపాధ్యాయుడు మేడికొండ వెంకటేశ్వర్లు శనివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు.
కలికివాయ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు గారు 1971 నుంచి 1977 వరకు సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ప్రస్తుత ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల)లో గ్రేడ్-1 తెలుగు పండిట్‌గా సేవలందించారు. 1984లో ఈ పాఠశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలగా మారకముందు జిల్లా పరిషత్ పాఠశాలగా ఉన్న సమయంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారు.తెలుగు భాషపై అపారమైన పట్టు, విద్యార్థుల పట్ల అంకితభావం, క్రమశిక్షణతో కూడిన బోధన ద్వారా ఎంతోమంది విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకులుగా నిలిచారు. ఆయన వద్ద విద్యనభ్యసించిన అనేక మంది నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు.మేడికొండ వెంకటేశ్వర్లు గారి అంత్యక్రియలు రేపు ఉదయం కలికివాయ గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, శిష్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *