google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రజల ప్రాణాలను రక్షించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి సూచనల మేరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ఈ-చలానాలు విధిస్తున్నారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, జరిమానాలు విధించడం తమ ప్రధాన ఉద్దేశం కాదని, ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యత పెంపొందించి ప్రాణ నష్టాలను నివారించడమే లక్ష్యమని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వారు సీటుబెల్ట్ వినియోగించాలని, అతివేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ-చలానాలు విధించడంతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *