google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఇటీవల సింగరాయకొండ లో చోటు చేసుకున్న పలు సంఘటనలు, నేరాల పై దృష్టి పెట్టిన పోలీస్ లు నివారణ నియంత్రణ చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా సోమవారం సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటిపాపల కాలనీ లో జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు ఆదేశాలతో, ఒంగోలు డి ఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పర్యవేక్షణ లో సింగరాయకొండ సీఐ వై శ్రీవారి, తమ సిబ్బంది తో కార్డాన్ సర్చ్ చేపట్టారు. ఈ కార్డన్ సర్చ్ లో సింగరాయకొండ సి ఐ వై శ్రీహరి సర్కిల్ ఎస్సై లు సింగరాయకొండ ఎస్సై ఎల్ సుధీర్ కుమార్, టంగుటూరు ఎస్సై వి నాగమల్లేశ్వర రావు, జరుగుమల్లి ఎస్సై పి భాగ్యరాజ్ మరియు సిబ్బంది 35 మంది పాల్గొన్నారు. కాటిపాపల కాలనీ లో చేసిన కార్డ న్ సర్చ్ లో భాగంగా వాహనాల తనిఖీలో ఎటువంటి కాగితాలు చూయించని 15 టూ వీలర్స్, అదుపులోనికి తీసుకుని, 12 వాహనాల డాక్యుమెంట్స్ చూసి, వాహన యజమానులకు అప్పగించారు. అదేవిధంగా గంజాయి అక్రమ రవాణా గురించి, గంజాయి వలన సామాన్య కుటుంబాలు సర్వ నాశనం అవటం వంటి విషయాలు గురించి వివరించారు. అదేవిధంగా ఎక్కువ మరణాలు రోడ్డు ప్రమాదాల వలననే జరగటం చాలా బాదాకారం, హెల్మెట్ వాడకం పాటిస్తే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గి మరణాలు తగ్గుతాయని చెప్పారు. మరో ముఖ్య విషయం ,సైబర్ నేరాలగురించి, దీనిలో చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా నేరాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న తప్పిదాలతో, ఎస్ ఎం ఎస్ లతో డబ్బులు పోగొట్టుకోవటం బాగా జరుగుతుంది. సైబర్ క్రైమ్ లో ఫోన్ లో ఎవరు ఏమి అడిగితే అలా ఒ టి పి లు చెప్పకుండా, అనుమానం వచ్చిన వెంటనే లోకల్ పోలిసులకు సమాచారం ఇచ్చినట్లైతే మీకు సత్వర న్యాయం చేయగలం అని సింగరాయకొండ సి ఐ వై శ్రీహరి ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయివాడకం కి వ్యతిరేఖంగా ర్యాలీ కూడా నిర్వహించారు, ఈ ర్యాలీ లో సుమారు 60 మంది పాల్గొన్నారు. ముక్యంగా గంజాయి అక్రమ రవాణా మరియు వినియోగం అరికట్టాలని మన ప్రభుత్వాలు తీసుకున్న సంకల్పం ఫలించాలని వివరించినారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *