google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

రైతులకు ప్రతిస్థాయిలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు చెప్పారు. ‘ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ‘ పథకంలో భాగంగా 2026 – 27 సంవత్సరంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న సందర్భంగా శనివారం గుడ్లూరులో నిర్వహించిన కందుకూరు నియోజకవర్గస్థాయి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ.ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ పథకంలోని లబ్ధిదారులను ఉద్దేశించి పశ్చిమ బెంగాల్ నుంచి ప్రధానమంత్రి శ్రీ.నరేంద్ర మోదీ, పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయడు చేసిన ప్రసంగాలను రైతులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం వీరిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉన్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ప్రస్తుత సంవత్సరంలో మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 187208 రైతు కుటుంబాలకు రూ.125.65 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేసిందన్నారు. కందుకూరు నియోజకవర్గానికి రూ.21.27 కోట్ల ఆర్థిక ప్రయోజనం లభిస్తున్నట్లు చెప్పారు. సాగులో మరింత ఆదాయం పొందేందుకు
రసాయనాల వినియోగాన్ని తగ్గించాలని, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మెళకువలు పెంచుకోవాలని రైతులకు ఆయన సూచించారు. ఈ దిశగానే ‘ రైతన్నా మీకోసం ‘ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ భూములకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులకు కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని వ్యవసాయ అవసరాల కోసమే వినియోగించుకోవాలని సూచించారు. సబ్ కలెక్టర్ శ్రీ.డి.హిమవంశీ మాట్లాడుతూ వినూత్న సాంకేతిక విధానాలను అవలంబించడం ద్వారా మరింత ఆదాయం పొందేలా దృష్టి సారించాలని రైతులకు సూచించారు. భూసార పరీక్షలు చేయించుకుంటూ పంట మార్పిడి విధానాలను అవలంబించాలని చెప్పారు.లబ్ధిదారులైన రైతులకు ఈ పథకం కింద అందిన ఆర్థిక సహాయ మెగా బ్యాంకు చెక్కును ఈ కార్యక్రమంలో ప్రదానం చేశారు. మేకపోతు రాఘవులు అనే రైతుకు 30 రకాల ధాన్యాలతో కూడిన ప్రత్యేక కిట్టును కూడా కలెక్టర్, ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్, ఇతర అధికారులు, కందుకూరు నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు శ్రావణి రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పిడి రత్నకుమారి, ప్రకృతి వ్యవసాయ డీపీఎం సుభాషిణి, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు వరలక్ష్మి, పశుసంవర్ధక
శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ సుజన్ కుమార్, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, పలువురు స్థానిక అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *