ధ్వజారోహణం రోజున గరుడ ప్రసాదం వితరణ
ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడేవిధంగా భక్తులకు సౌకర్యం
బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేందుకు భక్తులు సహకరించాలి.
ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, ఇ ఒ కృష్ణ వేణి పిలుపు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
యోగానంద లక్ష్మి నారసింహ స్వామి అనుగ్రహం తో దక్షిణ సింహాచలం గా ప్రసిద్ధి చెందిన వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో ఈ నెల 24 తేదీ నుండి జూలై 4 వ తేదీ వరకు జరుగ నున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక,భక్తుల ప్రాధాన్యంగా విజయ వంతంగా నిర్వహించేందుకు ధర్మ కర్తల మండలి, దేవాదాయ ధర్మాదాయ శాఖ చర్యలు చేపట్టిందని చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు వివరించారు. సోమవారం నరసింహ క్షేత్రం ధర్మ కర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి తమ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు నిర్వహణ గురించి వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు వివరిస్తూ ఈ నెల 24 నుండి జూలై 4 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సౌకర్యం కొరకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ క్షేత్రం లో బ్రహ్మోత్సవాల అంకురార్పణ మరుసటి రోజు 25 వ తేదీ ఉదయం 9 గంటలకు గరుడ ధ్వజారోహణ ఉంటుందని వివరించారు. ధ్వజారోహణ సందర్భంగా ధ్వజ స్తంభం వద్ద విశేష పూజ అనంతరం వితరణ చేసే గరుడ ప్రసాదం స్వీకరించిన సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం అన్నారు. అంతటి విశిష్టత ఉన్న ఈ కార్యక్రమం లో స్వయంగా పాల్గొని స్వామి వారి గరుడ ప్రసాదం పొందాలని వారు భక్తులను కోరారు. అదే విధంగా నిత్య కైకర్యాలు ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు, వాహన సేవలు,సాంస్కృతిక కార్యక్రమాలు, బండలగుడు పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేకించి హనుమంతు వాహన సేవ, గరుడ సేవ, స్వామి వారి కల్యాణోత్సవం, స్వామి వారి రథోత్సవం ప్రధానం అన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేందుకు భక్తులు ధర్మ కర్తల మండలి కి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కి సహకరించాలన్నారు. కొండ మీద, కొండ కింద ఎక్కడ భక్తులకు ఇబ్బందులు ఎదురు కాకుండా పోలీస్ బందోబస్తు, రక్షణ ఏర్పాట్లు, వైద్య ఆరోగ్య సౌకర్యం ప్రత్యేక వైద్య శిబిరాలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎక్కడ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వాతావరణానికి ఇబ్బంది కలుగకుండ భక్తులు సహజరించాలని వారు కోరారు.