తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి నేరాల నివారణకు కృషి చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఒంగోలు వన్‌టౌన్ సీఐ గారి ఆధ్వర్యంలో ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుడుచెరువు పార్క్‌లో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, కొత్త క్రిమినల్ చట్టాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, చైన్ స్నాచింగ్ ఘటనలు మరియు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన చట్టాలు, పోక్సో చట్టం, మహిళలపై నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయం పొందే మార్గాలపై వివరించారు. చిన్నారుల రక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సూచించారు.అదేవిధంగా యువత గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యం, విద్య, భవిష్యత్తును నాశనం చేస్తుందని వివరించారు. డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సైబర్ నేరాల విషయంలో ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే చైన్ స్నాచింగ్ వంటి నేరాల నుండి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ సురక్షిత ప్రయాణానికి సూచనలు అందించారు.