google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రజలకు సత్వర పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పామూరు పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి సంబంధిత యజమానికి అందజేశారు.మొబైల్ ఫోన్ పోయినట్లు అందిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు, ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించి మొబైల్ ఫోన్ ఆచూకీని గుర్తించి రికవరీ చేశారు. అనంతరం ధృవీకరణ ప్రక్రియ పూర్తిచేసి మొబైల్ ఫోన్‌ను దాని యజమానికి అప్పగించారు.ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ తిరిగి పొందిన బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల ఆస్తుల రక్షణ, పోగొట్టుకున్న వస్తువుల రికవరీలో మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *