భక్తి శ్రద్ధలు, విశ్వాసాలతో వైభవంగా జరిగే శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో జరుగుచున్న శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా పాత సింగరాయకొండ ప్రాంతం లో ఎక్కడైనా ఎవరైనా శాంతి భద్రతల పరిరక్షణ కి భంగం కలిగిస్తే బాధ్యులైన వారి పై పోలీస్ చర్యలు తప్పవని సింగరాయకొండ సి ఐ శ్రీహరి, ఎస్సై సుధీర్ కుమార్ హెచ్చరించారు. శనివారం ఆమేరకు వారిద్దరు ఒక ప్రకటన విడుదల చేస్తూ పాత సింగరాయకొండ లో దక్షిణ మెట్ల మార్గం వద్ద ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గత అనుభవాలు, తాజా పరిస్థితుల సమీక్ష తో బ్రహ్మోత్సవాల సందర్భంగా కొండ పైన, కొండ కొండ, ఎద్దుల బండ లాగుడు పోటీలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల వద్ద ఎక్కడా ఎటువంటి శాంతి భద్రతల సమస్య సృష్టించినా విఘాతం కలిగించినా పోలీస్ చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. శాంతి భద్రత పరిరక్షణ దృష్ట్యా దక్షిణ మెట్ల మార్గం వద్ద ప్రత్యేకంగా పోలీస్కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందనీ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ అధికారులు కోరారు. పోలీస్ కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని భక్తులు పోలీస్ కి సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *