తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించడం మరియు నేరాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి మహిళల భద్రత, మహిళలపై జరిగే నేరాల నివారణ, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా మోసాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు.అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటి నుంచి యువత దూరంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.ప్రజలు నేరాలపై అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా సైబర్ మోసాలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాజంలో శాంతి, భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా పోలీసులు పిలుపునిచ్చారు.