తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, నేరాల నియంత్రణ, చట్టవ్యతిరేక కార్యకలాపాల అరికట్టడం మరియు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వాహన తనిఖీలు (Vehicle Checking) ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.ఈ తనిఖీల్లో అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులు, పత్రాలు లేని వాహనాలు మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగాన్ని తనిఖీ చేయడంతో పాటు, నేరస్థులను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నారు.ప్రజల భద్రతకు విఘాతం కలిగించే నేరస్థులు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాల తరలింపు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజలు వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకుని, ట్రాఫిక్ మరియు చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.