google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కందుకూరులోని శ్రీ సంస్కృతి స్కూల్లో “జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు” ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సిహెచ్ ఇంద్రాణి గారు మాట్లాడుతూ విద్యార్థులు అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లను ప్రస్తావించారు. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని స్వీకరించండి అనారోగ్యానికి దారితీసే జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి, అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అని విద్యార్థులకు అమూల్యమైన సందేశాన్ని అందించారు. చైర్మన్ శ్రీ కొంక చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ “వైద్యో నారాయణో హరి” అంటే వైద్యుడు సాక్షాత్తు భగవంతుడైన శ్రీహరితో సమానం, వైద్యులు రోగుల పట్ల చూపే అంకిత భావం సమాజానికి వారు అందించే ప్రాణదాన సేవలు ప్రశంసనీయం అని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమం వలన ప్రేరణ పొందారు అనంతరం డాక్టర్ సిహెచ్ ఇంద్రాణి గారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో , వైస్ ప్రిన్సిపాల్ శోభారాణి, అకడమిక్ కోఆర్డినేటర్ సునీత మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *