google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజల భద్రతను మరింత పటిష్ఠం చేయడం, నేరాల నియంత్రణ మరియు అనుమానాస్పద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా లాడ్జీలు, డార్మిటరీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో లాడ్జీల రిజిస్టర్‌లు, అతిథుల గుర్తింపు పత్రాలు, సీసీటీవీ కెమెరాల పనితీరు, భద్రతా ప్రమాణాలు మరియు చట్టబద్ధమైన నిర్వహణపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులకు ఆశ్రయం కల్పించకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అతిథి పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు.నేరాల నివారణకు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *