google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న యూఐ (UI) కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న యూఐ కేసులను సమగ్రంగా పరిశీలిస్తూ, దర్యాప్తును వేగవంతం చేసి అవసరమైన చార్జిషీట్లు (Charge Sheets) మరియు ఫైనల్ రిపోర్టులు (Final Reports) సిద్ధం చేస్తున్నారు. ప్రతి కేసులో లభ్యమయ్యే ఆధారాలు, సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా, కేసుల విచారణలో నాణ్యతను పెంపొందిస్తూ పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *