తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు తన సిబ్బందితో కలిసి వేంపాడు గ్రామంలోని జగనన్న కాలనీలో జూదం నిర్వహిస్తున్న వారిపై ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి ₹3,730 నగదు మరియు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని, ప్రజలు తమ పరిసరాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.