తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-

మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొమరోలు పోలీస్ స్టేషన్ పోలీసులు అల్లినగరం గ్రామ శివారులోని పొలాల్లో నిర్వహించిన ప్రత్యేక దాడిలో జూదం ఆడుతున్న 9 మందిని పట్టుకున్నారు.ఈ దాడిలో వారి వద్ద నుంచి రూ.1,44,900 నగదుతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.జిల్లాలో జూదం, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ఇతర నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *