google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు.ప్రజలకు అసౌకర్యం కలిగించే, శాంతిభద్రతలకు భంగం కలిగించే ఓపెన్ బూజింగ్ (Open Boozing) ప్రదేశాలను తొలగించి, అక్కడ బహిరంగ మద్యం సేవించడం, జూదం మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు.ప్రజలకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించడం, నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా ఇటువంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.ప్రజలు తమ పరిసరాల్లో బహిరంగ మద్యం సేవించడం, జూదం లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed